రెడ్డి పల్లి తీజ్ ఉత్సవాలు

29-10-2026 | 08:47pm

పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాడి రాజయ్య,

మహా ముత్తారం అక్టోబర్ 29 ( విజయ క్రాంతి): మహా ముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో(Teej Festival) మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాడి రాజాయ్య (Congress President Jadi Rajayya)పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు, యువతులు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన తీజ్ వేడుకల్లో ఆమె పాల్గొని ఉత్సవాల ప్రాముఖ్యతను తెలియజేశారు.

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని రాజయ్య,పేర్కొన్నారు. మహిళల ఐక్యత, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు తీజ్ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. మహిళా కాంగ్రెస్ తరఫున మహిళల సంక్షేమానికి, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

వారితోపాటు, DCC కార్యదర్శి తొలం వెంకటశ్వర్లు,సర్పంచ్ లు బెల్లంకొండ సమ్మయ్య, పులిసే సుమలత రాజు, గోస్కుల సత్యం, చీపురు రాజక్క మల్లయ్య,ఉప సర్పంచ్ వెన్నపురెడ్డి సాంబశివారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సారయ్య, నాయకులు, నూకల రవి, రమేష్,శ్రీను, రాజమల్లు,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు