బోర్లగూడెంలో ఘనంగా తీజ్ ఉత్సాహాలు
మహా ముత్తారం అక్టోబర్ 29 (విజయ క్రాంతి): మహాముత్తారం మండలం బోర్లగూడెం బాలాజీ తండాలో(Borlagudem Balaji Thanda) ఈ రోజు లంబాడిల తీజ్ ఉత్సవాలు(Teej celebrations) ఘనంగా నిర్వహించారు.గిరిజనుల సంప్రయాదాయ ప్రకారం గోధుమలను, శనగలను శ్రేష్ఠమైన పుట్టమట్టిని ఉట్టిలో వేశి తొమ్మిది రోజులు పెండ్లి కానీ అమ్మాయిలు పూజిస్తారు.
తండాలోని ప్రజలు, యువకులు, యువతులు, నృత్యం తీసుకుంటు తీజ్ ను చెరువులో నిమర్జనం చేస్తారు.ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు ఈ తంతు కొనసాగుతుంది.తీజ్ పండుగతో గ్రామంలో సందడి నెలకొంది. తీజ్ పండుగలో గ్రామ సర్పంచ్ అజ్మీరా దరంసింగ్,పూజారి హాట్కార్ శ్రీరామ్, బావు సింగ్, సితు నాయక్, అజ్మీరా పూల్ సింగ్, భూక్యా రాంలాల్, బాలు నాయక్, మంగు నాయక్, దరంసోద్ సుజాత, అజ్మీరా సుజాత, భూక్యా ఈరి భాయ్ భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.