వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

19-10-2026 | 05:30am
  1. ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించే ఉత్సవాలు
  2. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

మల్కాజిగిరి, అక్టోబర్ 18 (విజయక్రాం తి) : శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు(Sridevi Navaratri Celebrations) ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajashekar Reddy) అన్నారు. నేరేడ్మెట్, వినాయక్ నగర్, మౌలాలి డివిజన్లోని కాకతీయ నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 15 అమ్మవారి మండపాలను ఆదివారం ఆయన దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన, అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ, అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని  ప్రార్థించానన్నా రు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిం చడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదర భావం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. మన సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచే నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు.

ఇ లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంప్రదాయాల గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయ కులు బద్దం పరుశు రాం రెడ్డి, జీకే హనుమంత రావు, జేఏసీ వెంకన్న, ఫరీద్, సురేష్, గౌస్ ఇమ్రాన్, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్, సాయిగౌడ్, సుమన్ గౌడ్, శివగౌడ్, శంకర్ రావు, శ్రీనివాస్, నవీన్ రాజ్, సింగ్ ,అవినాష్, పేపర్ శ్రీనివాస్ రామకృష్ణ, సంపత్ యాదవ్, సంతోష్, హేమంత్ రెడ్డి, బాలకృ ష్ణ, బాల, రఘుపతి రెడ్డి, వినీత్ పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఘట్‌సర్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : శ్రీ దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఆదివారం పోచారం డివిజన్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటీక్యాల కృష్ణరెడ్డి, గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు యువజన సంఘా ల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గమాత  అ మ్మవారిని  మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉ పాధ్యక్షులు  వేముల మహేష్ గౌడ్ దర్శించు కుని ప్రత్యేక పూజ లు జరిపారు.

అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, సహకార బ్యాంక్ డైరెక్టర్ ఇటిక్యాల రామకృష్ణరెడ్డి, మాజీ కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్, నాయకులు గొంగళ్ళ బాలేష్, అచ్చిని రమే ష్, గొంగళ్ళ చంద్రకాంత్, ననావత్ సురేష్ నాయక్, ఈగ మధు ముదిరాజ్, కొడకండ్ల లింగం, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  1. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి : చంద్రశేఖర్ రెడ్డి
  2. చైతన్యపురి డివిజన్‌లో అమ్మవారి మండపాల సందర్శన

నాగోల్, అక్టోబర్ 18 (విజయక్రాంతి):దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి చైతన్యపురి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. ద్వారకాపురం, ఫణిగిరి కాలనీ, భవానీనగర్, ఇందిరానగర్ కాలనీల్లో కొలువుదీరిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీ నవరాత్రులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి ప్రశాంత్, సాయి, నరేష్, రాహుల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు