లార్జెస్ట్ తైక్వాండో లెస్సన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): లార్జెస్ట్ తైక్వాండో లెస్సన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించి ఎదులాబాద్ గ్రామానికే వన్నె తెచ్చారు గ్యార నరేష్. ఆగస్టు 9వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన లార్జెస్ట్ తైక్వాండో లెస్సన్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన గ్యార నరేష్ ఎదులాబాద్ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. 2026 అక్టోబర్ 30 శుక్రవారం నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనా చారి గ్యార నరేష్ ప్రతిభకి మెచ్చి హర్షం వ్యక్తం చేసి అవార్డును అందజేశారు. ఎంజెఆర్ అకాడమీ అధ్యక్షుడు జయంత్ రెడ్డి, కె ఎల్ బి అకాడమీ అధ్యక్షుడు కె.పి. హనుమంతు ఈ కార్యక్రమంలో పాల్గొని బ్లాక్ బెల్ట్ 1వ డాన్, తైక్వాండో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ క్యార నరేష్ ను అభినంచించారు.