తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న

06-10-2026 | 08:21pm

జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్

జవహర్ నగర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి గెరిల్లా ధీరుడు వడ్డే ఓబన్న(Freedom Fighter Vadde Obanna) అని జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ అన్నారు. మంగళవారం చెన్నాపురంలో నిర్వహించిన ఓబన్న వర్ధంతి కార్యక్రమానికి పార్టీ శ్రేణులతో కలిసి హాజరై, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో చంద్రపురి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బల్లి శ్రీనివాస్ గుప్తా, వెంకటేష్, ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, గజ్వేల్ శంకర్, వీర్ల బుజ్జి, విజయరాయి, మల్లేశం, రాము, రాజు యాదవ్, బిట్టు, చెన్నాపురం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు