పట్టుబడిన వాహనాలకు వేలం
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసులలో పట్టుబడిన 3 వాహనాలకు వేలంపాట నిర్వహించినట్లు గురువారం ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ మంగమ్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పట్టణంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో 3 వాహనాలకు వేలం పాట నిర్వహించాం.
హెచ్ఎఫ్ డీలక్స్ రూ 4400 లకు, వ్యాగన్ఆర్ కార్ రూ 197500లకు ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దక్కించుకున్నట్లు తెలిపారు.ఈ వేలం పాట ఎక్సైజ్ శాఖ నియమ నిబంధనల మేరకు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై రచన, ఆప్కారి శాఖ జమేదార్ సోమయ్య, ఆప్కారి శాఖ కానిస్టేబుళ్లు నవీన్ , విట్టల్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.