స్త్రీనిధి రికవరీ డ్రైవ్ & క్లస్టర్ సమీక్ష సమావేశం

30-10-2026 | 12:03am

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని అక్కంపల్లి, మాటూర్, మాసన్‌పల్లి, చిన్న ఆత్మకూరు గ్రామాల్లో స్త్రీనిధి రుణాల రికవరీలను మెరుగుపరిచేందుకు ఇంటింటి రికవరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఎస్.హెచ్.జి సభ్యులకు స్త్రీనిధి రుణాల ప్రయోజనాలు, ముఖ్య లక్షణాలు అవసరాలకు అనుగుణంగా రుణాలు పొందే అవకాశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ రికవరీ డ్రైవ్‌లో భాగంగా సుమారు రూ.50,000 రుణ బకాయిలను వసూలు చేయడం జరిగింది.

మిగిలిన బకాయిదారులు కూడా రాబోయే రోజుల్లో తమ రుణ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చిన్న ఆత్మకూరు గ్రామంలో క్లస్టర్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో స్త్రీనిధి రికవరీల పురోగతి,క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలు, మన స్త్రీనిధి యాప్ వినియోగం, డిజిటల్ చెల్లింపులపై సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు, పనితీరును మెరుగుపరిచేందుకు సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  స్త్రీనిధి ఆర్ఎం కిరణ్, ఏపిఎం కొమ్మ దత్తు,స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ అమల,  సిసిలు నజీర్,పెంటయ్య, వివోఏలు మరియు వివో అధ్యక్షులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు