పేద విద్యార్థుల వైద్య విద్యకు ఎమ్మెల్యే టీఆర్ఆర్ అండ
ఐదుగురు MBBS విద్యార్థులకు TRR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సహాయం
మహమ్మదాబాద్: గండీడ్, పరిగి నియోజకవర్గానికి చెందిన ఐదుగురు విద్యార్థులు పటాన్చెరులోని TRR మెడికల్ కాలేజీలో MBBS సీట్లు సాధించిన నేపథ్యంలో, వారి ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించేందుకు పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు.TRR చారిటబుల్ ట్రస్ట్(TRR Charitable Trust) ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.60,000 చొప్పున మొత్తం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని విద్యార్థుల కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు.
ఆర్థిక సహాయం పొందిన విద్యార్థులు:
బాగరి వైష్ణవి – మంచనపల్లి గ్రామం
గోస్కి ఆనంద్ కుమార్ – పరిగి పట్టణం
కాట్రావత్ శ్రీవాణి – షేక్పల్లి గ్రామం, మహమ్మదాబాద్ మండలం
ఈడిగి అక్షయ – పెద్దవార్వాల్ గ్రామం, గండీడ్ మండలం
చిట్టెల గాయత్రి – మహమ్మదాబాద్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి(MLA Dr. T. Ram Mohan Reddy) మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదిగి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు(Medical Services) అందించాలని ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల ఉన్నత చదువులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు.
TRR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. టి. రితిక్ రెడ్డి ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఐదుగురు వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. తమ పిల్లల వైద్య విద్యకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి గారికి, TRR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. టి. రితిక్ రెడ్డి గారికి, ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతిభకు ప్రోత్సాహం.. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసా.. ఇదే TRR చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం!
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహమ్మదాబాద్ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ, మాజీ ఎంపీపీ శాంతిరంగ్యా, పెద్దవార్వాల్ సర్పంచి వీరన్న, దిగంబర్ రావు, వెంకటేష్ గౌడ్, తదితర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.