వీరనారి ఐలమ్మ బాటలో నడవాలి
చేగుంట,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేగుంట మండలం(Chegunta Mandal) రాంపూర్ గ్రామ రజక సంఘం అధ్యక్షులు అశోక్ పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 131వ జయంతి(Chakali Ilamma 131st Jayanthi)ని పురస్కరించుకుని శనివారం గ్రామంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం దొరల అన్యాయాలను ఎదిరించిన చాకలి ఐలమ్మ ధైర్యం నేటి తరానికి ఆదర్శమన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాలని సూచించారు. వెనుకబడిన, పీడిత వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ,ఏ ఎం సి డైరెక్టర్ కాషాబోయిన శ్రీనివాస్, శ్రీశైలం,విజయ, వార్డ్ సభ్యులు యాపర్ల నరేష్, శారదా,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు .