బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షునిగా సుంకరి సతీష్ ఎన్నిక

27-09-2026 | 04:43pm

పాపన్నపేట,సెప్టెంబర్27: భారతీయ జనతా యువమోర్చా(Bharatiya Janata Yuva Morcha) మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పాపన్నపేట మండలం కేంద్రానికి చెందిన సుంకరి సతీష్(Sunkari Satish) ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ మెదక్ కార్యాలయంలో(Bharatiya Janata Party Medak Office) జరిగిన సమావేశంలో పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మరియు యువమోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నియమితుయ్యారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో రెండవసారి జిల్లా బాధ్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు