సార్ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన
ఆలేరు, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) చేపడుతున్న సార్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)(Special Intensive Revision) ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, ఓటు హక్కు పరిరక్షణ(Protection of Voting Rights) కోసం ఏఐసీసీ , టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం భువనగిరి జిల్లా(Bhuvanagiri District) కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి(Kumbham Anil Kumar Reddy) తెలిపారు.
ఉదయం 10 గంటలకు వినాయక చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు సమీకరించి, అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువజన, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.