నేతాజీ వాకార్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ అందజేత

27-09-2026 | 07:05pm

మణుగూరు, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మణుగూరులో నేతాజీ వాకర్స్ క్లబ్(Netaji Walkers Club) ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ క్రికెట్ ఛాంపియన్‌గా రాణిస్తున్న గుండె నేహాకు క్రికెట్ కిట్‌ను అందజేశారు. ఆదివారం మణుగూరు గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నేతాజీ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ సామ శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, పుచ్చకాయల శంకర్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్ తో పాటు వాకర్స్ టీం సభ్యులు పాల్గొని నేహాకు క్రికెట్ కిట్‌ను అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,,, క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న యువ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తే వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత ప్రతిభను కనబరుస్తారని పేర్కొన్నారు. మహిళా క్రికెటర్ కు రోజు రోజు ఆదరణ పెరగడతో కృషి పట్టుదలతో గుండె నేహా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి మణుగూరు ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని నేతాజీ వాకర్స్ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు