ధర్నాను విజయవంతం చేయండి

27-09-2026 | 07:10pm

ములకలపల్లి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఏఐసీసీ, పిసిసి పిలుపుమేరకు సెప్టెంబర్ 28 సోమవారం ఉదయం 10 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాచౌక్ లో జరిగే నిరసన కార్యక్రమంలో ములకలపల్లి మండల బిఎల్ఏలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని ములకలపల్లి మండల కాంగ్రెస్ బిఎల్ఎ కోఆర్డినేటర్ సురభి రాజేష్(Congress BLA Coordinator Surabhi Rajesh) కోరారు.

ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడటం ఎన్నికల వ్యవస్థ ప్రాథమిక బాధ్యతన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ, ఓటర్ల జాబితా విషయంలో అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందన్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడటం, తొలగింపులు లేదా మార్పులు జరిగితే పారదర్శకమైన పరిశీలన, అభ్యంతరాలకు అవకాశం కల్పించడం వంటి అంశాలపై స్పష్టత అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడేలా ఎన్నికల సంస్థలు పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణను కోరుకునే ప్రతి ఒక్కరూ సామాజిక కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు