కాళేశ్వరంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..

24-11-2026 | 10:21pm

భూపాలపల్లి/మహాదేవపూర్ నవంబర్ 24 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయ(Kaleshwaram Temple) బాలాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గోదావరిలో ఆలయం ఆధ్వర్యంలో గోదావరి త్రివేణి సంగమం తీరంలో గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు పవిత్ర గోదావరిలో దీపాలను వదిలారు. అనంతరం సరస్వతి ఘాట్ వద్ద హారతి కార్యక్రమం నిర్వహించారు.

అక్కడి నుంచి ఆలయానికి చేరుకున్న అనంతరం జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జ్వాలాతోరణాన్ని వెలిగించారు. అనంతరం ఆలయానలో దీపలంకరణ ప్రమిదలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఎస్ఐ సురేష్, ఆలయ ఈవో మహేష్, ధర్మకర్తలు సుంకరి సీతయ్య, కుంబం పద్మ, అశోక్, గందెసిరి సత్యనారాయణ, శ్రీధర్ రావు, సర్పంచ్ మోహన్ రెడ్డి, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు