రైతు భీమాను వెంటనే అమలు చేయాలి

07-09-2026 | 11:43pm

రైతు రక్షణ సమితి సభ్యులు సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

శివంపేట్,(విజయక్రాంతి): తెలంగాణలో ఆగస్టు 13 నుంచి నిలిపివేసిన రైతు భీమా పథకాన్ని(Farmers Insurance Scheme) వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి(Farmers Protection Committee) నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. యూరియా యాప్(Urea App) మండలాలవారీగా విభజించి ప్రత్యేక యాప్ ను రూపొందించాలని, వ్యవసాయానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. ప్రభుత్యం ప్రకటించిన 33 రకాల  వరి పంటలకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మైసయ్య యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్యాల చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి పరశురాం యాదవ్,సభ్యులు మల్లేష్ రైతులు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు