ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్

07-09-2026 | 02:59pm

శంషాబాద్‌, సెప్టెంబర్‌ 7: ప్రముఖ యూట్యూబర్ నందన(Nandana)వరల్డ్‌ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు(Jobs), స్పాన్సర్‌షిప్‌లు(Sponsorships) ఇప్పిస్తామంటూ పలువురి నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేయగా, ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు