ఉపాధ్యాయులను సన్మానించిన ఎంఈఓ విజయ్ కుమార్

08-09-2026 | 12:55am

కుభీర్, సెప్టెంబర్ 07 (విజయక్రాంతి): కుభీర్ మండల(kubeer mandal) కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్స్ డే వేడుకలను(Teachers' Day celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల హెడ్‌మాస్టర్ గంగాధర్, PRTU కుభీర్ మండల అధ్యక్షుడు లింగాల అరవింద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ విజయ్ కుమార్(MEO Vijay Kumar) మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు