అనుమతి లేని వెంచర్ పై చర్యలు తీసుకోవాలి
08-09-2026 | 12:40am
రాజాపూర్: రాజాపూర్ గ్రామపంచాయతీ(Rajapur Gram Panchayat) పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ అనుమతి లేని వెంచర్ పై చర్యలు తీసుకోవాలని రాజాపూర్ కు చెందిన హనుమగళ్ల బుగ్గయ్య, పల్లె శేఖర్, కుమ్మరి రమేష్ సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి(Prajavani )లో ఫిర్యాదు చేశారు.పంచాయతీకి కేటాయించాల్సిన 10 శాతం భూమిని పంచాయతీ కేటాయించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
