క్షమాపణ చెప్పాకే.. మిగతా కార్యకలాపాలు : మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రాంగణంలో బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో నెలకోన్న తీవ్ర ఉద్రిక్తతపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)పై అంత ఘోరమైన భాష ఉపయోగించడం సరికాదని ఆయన మండిపడ్డారు. సభ్యసమాజం అసహ్యించుకునే భాషను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడారని, ఈ ఘటనపై స్పందించాల్సిన బాధ్యత మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఉందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కేసీఆర్ స్పందించకుంటే ఆయనే ప్రేరేపించారన్న అనుమానాలు వస్తాయని, పోలీసులపై కేటీఆర్ చేయి చేసుకున్నట్లు కనబడుతుందన్నారు. పోలీస్ సిబ్బందిని గొంతు పిసుకుతున్నట్లు కనిపించిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ పోలీసులపై ఇలాంటి ఘటనాలు జరగలేదని మంత్రి తెలిపారు.
టీషర్టుపై నినాదాలు ఉంటే అనుమతించకూడదని నిబంధన ఉందని, సభా గౌరవాన్ని తగ్గించేలా బీఆర్ఎస్(BRS) సభ్యులు టీషర్టులపై నినాదాలు ఉన్నాయి. రూల్స్ కు అనుగుణంగానే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని, మహిళా సభ్యులకు ఇబ్బంది జరిగిందని తెలియగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సమీక్ష చేశారు. ఏవైనా లోటుపాట్లు జరిగితే మా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని, దీంతో దళిత వ్యతిరేక పార్టీగా బీఆర్ఎస్ నిరూపించుకుంటుందని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామని కేసీఆర్ బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులకు కాంగ్రెస్ భయపడే ప్రసక్తి లేదు. స్పీకర్ కు క్షమాపణ చెప్పాకే.. మిగతా కార్యకలాపాలు ఉంటాయని, మహిళా సభ్యులకు ఇబ్బంది జరిగుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి వెల్లడించారు.
