7 September, 2026 | 12:49 PM

బీజేపీ ఆందోళనతో శాసనసభ వాయిదా

07-09-2026 | 10:43am

హైదరాబాద్: బీజేపీ(BJP) సభ్యుల ఆందోళనతో తెలంగాణ శాసనసభను స్పీకర్(Speaker) 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. భూదందాపై విచారణ జరిపించాలని బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చొని సభకు సహకరించాలని స్పీకర్ కోరారు. 22ఏ అంశంపై బీఏసీలో నిర్ణయం తీసుకుని చర్చిద్దామని స్పీకర్ తెలిపారు. అయినా ఆందోళన కొనసాగడంతో సభను వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు