నేను ఏమీ అనలేదు: తాతా మధు

07-09-2026 | 06:33pm

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)ను నేను ఏమీ అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(MLC Thatha Madhu) పేర్కొన్నారు. స్పీకర్ అంటే నాకు గౌరవం ఉందని, నేను అనని మాటలను నాకు ఆపాదించడం సరికాదన్నారు. నేను స్పీకర్ ను అన్నట్లు భావిస్తే నా మటలు ఉపసంహరించుకుంటున్నానని, నా మాటలపై విచారం వ్యక్తం చేస్తున్నానని తాతా మధు తెలిపారు. నాపై దాడి చేసి, గొతు నొక్కేప్రయత్నం చేశారని, నాపై దాడి చేసిన వారిని మాత్రమే ఆవేశంతో అన్నానని ఆయన వివరించారు. మా సభ్యులపై దాడి చేసినందుకు హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి() క్షమాపణ చెప్పాలని, మా సభ్యులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తాతా మధు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు