22ఏపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది: మంత్రి శ్రీధర్ బాబు
07-09-2026 | 10:30am
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. 22ఏ అంశంపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) తెలిపారు. సభలో ఆందోళన చేస్తున్న బీజేపీ సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో వాహనాలు నిలిచిపోయాయి. లక్డీకపూల్, బహీర్‌బాగ్, నాంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.
ఇవి కూడా చదవండి:
22ఏ, ఫీజు బకాయిలే బీజేపీ అస్త్రాలు
22ఏ నిషేధిత జాబితాను తొలగించాలి
22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి






