టీటీడీ కళ్యాణ మండపం భూమిని టీటీడీ పేరుతోనే మ్యుటేషన్ చేయాలి

08-09-2026 | 12:31am

చిట్యాల బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ప్రజావాణికి వినతి

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణ ప్రజల ప్రయోజనాల కోసం టీటీడీ కళ్యాణ మండపం(TTD Kalyana Mandapam) నిర్మాణానికి కొనుగోలు చేసిన భూమిని, అదే టీటీడీ కళ్యాణ మండపం పేరుతో మ్యుటేషన్ చేయాలని చిట్యాల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం  నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో(Nalgonda District Collectorate) నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీజేపీ నాయకులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. చిట్యాల–భువనగిరి రోడ్డులోని సర్వే నంబర్‌ 649లో టీటీడీ కళ్యాణ మండపం కోసం ఎకరం 12 గుంటల భూమి కొనుగోలు చేసినట్లు వారు తెలిపారు.

చిట్యాల పట్టణ ప్రజలు ఏ ఉద్దేశంతోనైతే ఈ భూమి కొనుగోలుకు డబ్బులు అందించారో, అదే ఉద్దేశంతో భూమిని టీటీడీ కళ్యాణ మండపం పేరుతో మ్యుటేషన్ చేయాలని కోరారు. ప్రజల నిధులతో కొనుగోలు చేసిన భూమిని ఇతర ప్రయోజనాలకు వినియోగించకుండా, చిట్యాల పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి కేటాయించాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంత్ రవిదాస్ జయంతి ఉత్సవాల కన్వీనర్ మాస శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంజి గోవర్ధన్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కూరెళ్ల శ్రీను, జిల్లా కార్యవర్గ సభ్యుడు జయారపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు