రాష్ట్రస్థాయికి ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు

03-11-2026 | 06:42pm

పాపన్నపేట, నవంబర్ 03: మెదక్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల అండర్ 17 కబడ్డీ(Kabaddi) పోటీలలో పాపన్నపేట ఉన్నత పాఠశాల బాలుర, బాలికల జట్లు గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, పిడి రమేష్ వెల్లడించారు.

మెదక్ జిల్లా నుండి 24 పీఎం శ్రీ పాఠశాలలు ఈ పోటీలలో పాల్గొనగా పాపన్నపేట ఉన్నత పాఠశాలకు చెందిన బాలుర జట్టు, బాలికల జట్టు గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. హైదరాబాదులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ మీట్లలో ఈ రెండు జట్లు పాల్గొంటాయని పిడి రమేష్ వెల్లడించారు. జిల్లాస్థాయి పోటీలలో పాపన్నపేట జట్లు రెండింటికీ రెండు ఎంపిక కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు