తుక్కాపూర్ లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

30-10-2026 | 07:34pm

కొల్చారం: మండలంలోని తుక్కాపూర్ గ్రామం(Tukkapur village)లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి(Indiramma House Construction) ముగ్గు పోసి భూమిపూజ నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులు ఆయిలి భవాని, సురేష్‌లకు సంబంధించిన ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు భూమిపూజ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆరె రవీందర్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు మమతా శ్రీనివాస్, సుధాకర్, రామయ్య, శివాజీ, మల్లప్ప, వీరప్ప, అశోక్, లింగం, శివ్వమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు