లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

11-09-2026 | 07:34pm

​చేగుంట,(విజయక్రాంతి):  చేగుంట మండల పరిధిలోని చందాయిపేట్ గ్రామ పంచాయతీ(Chandaipet Gram Panchayat) ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో, సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌(Free Mega Health Camp)కు విశేష స్పందన లభించింది. డిస్ట్రిక్ట్ హెల్త్ క్యాంప్స్ చైర్మన్ స్వర్గం సిద్దిరాములు(District Health Camps Chairman Swargam Siddhi Ramulu) పర్యవేక్షణలో చేపట్టిన ఈ శిబిరంలో మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రుతన్, డాక్టర్ ఆకాంక్ష, మార్కెటింగ్ మేనేజర్ పవన్ బృందం సుమారు 215 మంది గ్రామస్తులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ రాజనకు రామచంద్రం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను చేరువ చేయడమే తమ సంస్థ ప్రధాన సంకల్పమని, భవిష్యత్తులోనూ మరిన్ని ఆరోగ్య సేవా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఆకుల సుఖేందర్, క్లబ్ సెక్రెటరీ బుర్కా నాగరాజు, సర్పంచ్ తాలుక మహేశ్వరి సాయిబాబా, ఉప సర్పంచ్ పబ్బా నాగేష్ గుప్తా , పంచాయతీ కార్యదర్శి కృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు