కేజీబీవీ విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ

11-09-2026 | 08:42pm

కొత్తపల్లి,(విజయక్రాంతి): విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కరీంనగర్ జిల్లా(Karimnagar District) వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(Rashtriya Bal Swasthya Karyakram) ద్వారా కేజీబీవీ, సప్తగిరి కాలనీ పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన విద్యార్థులకు కళ్లద్దాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, కరీంనగర్ డాక్టర్ రాజగోపాల్ రావు కేజీబీవీ పాఠశాలను సందర్శించి కార్యక్రమాన్ని పరిశీలించారు.

విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువులో రాణించడానికి కంటి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా చిన్నారులు మరియు విద్యార్థుల్లో వివిధ ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. కంటి చూపు సమస్యలు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన కళ్లద్దాలను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శైలేందర్ గారు, ఆర్‌బీఎస్‌కే సిబ్బంది, సప్తగిరి కాలనీ వైద్యాధికారి, పాఠశాల సిబ్బంది మరియు ప్రాథమిక ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు