గ్రామపంచాయతీని సందర్శించిన డిఎల్పిఓ సురేష్ బాబు

02-11-2026 | 09:45pm

కొల్చారం: మండలంలోని ఎనగండ్ల గ్రామపంచాయతీ(Enagandla Gram Panchayat)ని డివిజనల్ పంచాయతీ అధికారి సురేష్ బాబు(DLPO Suresh Babu) సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ రికార్డులను, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కోరబోయిన లక్ష్మి పెంటయ్య(Sarpanch Lakshmi Pentaiah)తో కలిసి చెత్త బుట్టాలను పంపిణీ చేశారు.

అనంతరం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, క్రిమిటోరియం, నర్సరీ, తెలంగాణ క్రీడా ప్రాంగణం తదితర ప్రాంతాలను పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న పనులు, ఆయా ప్రదేశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొనింటి రాజా గౌడ్, ఉపసర్పంచ్ గోపాల్ గౌడ్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు