సత్తుపల్లి ప్రెస్ క్లబ్‌కు పూర్తిస్థాయి కార్యవర్గం

02-11-2026 | 10:23pm

ఆత్మీయ సమ్మేళనంలో మిగిలిన కమిటీ సభ్యుల ఎన్నిక

సత్తుపల్లి. నవంబర్ 2. ( విజయ క్రాంతి ): సత్తుపల్లి ప్రెస్ క్లబ్(Sattupalli Press Club) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం బేతుపల్లిలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అభివృద్ధి, పాత్రికేయుల సంక్షేమం, సభ్యుల మధ్య ఐక్యత, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ప్రెస్ క్లబ్‌లో మిగిలిన కార్యవర్గ స్థానాలకు సభ్యులను ఎన్నుకోవడంతో కమిటీ పూర్తిస్థాయిలో ఏర్పాటైంది.

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తడికమళ్ల దేవదానం, ప్రధాన కార్యదర్శిగా చీపు గంగాధర్ గతంలోనే ఎన్నికయ్యారు. తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో మిగిలిన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గం:

అధ్యక్షుడు: తడికమళ్ల దేవదానం, ప్రధాన కార్యదర్శి: చీపు గంగాధర్, ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు: బేతి ఆనంద్, ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు: కొత్తపల్లి సుధాకర్, కోశాధికారి: వభిలిశెట్టి రామారావు, సహాయ కార్యదర్శులు: హెచ్.కె. బాజీ, మారోజు అశోక, ప్రచార కార్యదర్శి: సురేష్, సహాయ ప్రచార కార్యదర్శి: మెహరాజ్.

ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ పాత్రికేయులు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. పరస్పర సహకారం, సమన్వయం, గౌరవంతో క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.

సీనియర్ పాత్రికేయులు సుధాకర్, యం.డి. సైబుద్దీన్, భీమిశెట్టి రాము, రామ్‌శెట్టి లక్ష్మణరావు, చినేని బాలకృష్ణలతో పాటు రాజేష్ రెడ్డి, శీలం శ్రీనివాస్ రెడ్డి, విజయభాస్కరరెడ్డి, కొర్ర బాలాజీ, నల్లంటి మోహన్‌రావు, కాకర్ల జగన్, జె. శ్రీనివాసరావు, కొవ్వూరి సాంబ, యనమల విజయ్, గోదా విష్ణు, ఎస్.కె. మీరా, రామిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు