మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కు పరామర్శ

02-11-2026 | 10:02pm

తాడ్వాయి,నవంబర్,02( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మార్కెట్ కమిటీ(Sadashiva Nagar Market Committee) మాజీ వైస్ చైర్మన్ మైపాల్ రెడ్డిని బి.ఆర్.ఎఫ్ పార్టీ నాయకులు సోమవారం పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మాజీ వైస్ చైర్మన్ ప్రమాదానికి గురయ్యాడు.

ఆయన హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్సల అనంతరం గ్రామానికి వచ్చారు.ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన ను  సంతాయిపేటలో పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ మాజీ జడ్పిటిసి పరిగెల రాజేశ్వర్ రావు, నాయకులు ప్రసాద్, రాజేశ్వర్ రెడ్డి లు ఉన్నారు.

మరిన్ని వార్తలు