కొల్లాపూర్ నియోజక వర్గంలో ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

02-11-2026 | 10:07pm

ప్రజావాణిలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

కొల్లాపూర్ నవంబర్ 2; నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వినతిపత్రం అందజేసిన. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి(Former MLA Beeram Harshavardhan Reddy).ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక మంత్రి రైతాంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసారు.

ఏలిలో వస్తుందని వాతావరణ శాఖ కావచ్చు అంతర్జాతీయ సంస్థలు ముందుగానే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని వారు ఆరోపించారు. పంట ఎండిపోయిన ప్రతి ఎకరాకు 20వేల కష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.

కాంగ్రెస్ నాయకులు కర్ణాటక టూర్ వెళ్లి నాలుగు టిఎంసిలు, ఐదు టీఎంసీలు  టీఎంసీలు ఎక్కడో నీళ్లు ఎక్కడో ఆ నాయకులు కన్నా తెలుసో లేదో కరువు మండలంగా ప్రకటించి చేతులు దులుపుకోవడం కాకుండా రైతు ,కూలీలు కౌలు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మాజీ ఎంపీపీ నరేందర్ రెడ్డి. పెంట్లవెల్లి సొసైటీ చైర్మన్ విజయ రామారావు. గోపులాపూర్ సర్పంచ్ మేడిపల్లి సరిత బిచ్చారెడ్డి. జటప్రోలు మాజీ కాజా. రాజేష్ టిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు