అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
02-11-2026 | 10:19pm
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి ): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) కోరారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి విద్యార్థినులకు అందిస్తున్న సౌకర్యాలు, వంటగది, భోజనశాల, పాఠశాలలో అదనంగా నిర్మిస్తున్న తరగతి గదుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి, నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.