స్మశానవాటికలో అక్రమ రేకులషెడ్లు కూల్చివేత
బెల్లంపల్లి: పట్టణంలోని షంషీర్ నగర్ బస్తీ స్మశాన వాటిక(Shamshir Nagar Basti Crematorium)లో అక్రమంగా రేకుల షెడ్డు ను అధికారులు కూల్చివేశారు. స్మశాన వాటికలో వెలసిన అక్రమ షెడ్ల పై బస్తీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి అచ్చినా ఆదేశాలతో బెల్లంపల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది స్మశాన వాటికలో నిర్మించిన అక్రమ రేకుల షెడ్డు నిర్మాణాన్ని తొలగించారు.నూతన గృహ నిర్మాణాలు చేపట్టే ముందు తప్పనిసరిగా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి, నిబంధనల ప్రకారం భవన నిర్మాణ అనుమతులతో నిర్మాణ పనులు ప్రారంభించాలనీ మునిసిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ తెలిపారు.