అర్హులైన వారికి ఆసరా పింఛన్లు
రాజాపూర్ అక్టోబర్ 17: అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందించే చేయూత పింఛన్లు('Cheyutha' Pensions) అందించడమే ప్రధాన లక్ష్యమని మహబూబ్నగర్ జెడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి(Mahabubnagar ZP CEO Venkat Reddy) అన్నారు. శనివారం మండల పరిధిలోని చెన్నవెల్లి, తిరుమలాపూర్, రాఘవాపూర్, చొక్కంపేట్, కొర్రతండా, దొండ్లపల్లి సింగమ్మగూడాత, గుండ్లపొట్లపల్లి, కళ్లేపల్లి, మోతుకులకుంట, రాజాపూర్లో ఆసరా పింఛన్ల దరఖాస్తులపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ సంక్షేమా ఫలాలు అరులైన వారికే అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, సూపరింటెండెంట్, ఏపీవో భారతి, వెంకటేష్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.