సీనియర్ పాత్రికేయులు యండమూరి వరప్రసాద్ కన్నుమూత

17-10-2026 | 11:39pm

జర్నలిజం రంగానికి తీరని లోటు.. పలువురి సంతాపం...

బాన్సువాడ, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడకు చెందిన సీనియర్ పాత్రికేయులు యండమూరి వరప్రసాద్(Senior journalist Yandamuri Varaprasad) అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం బాన్సువాడ పట్టణంలోని జర్నలిస్టుల కాలనీ(Journalists' Colony) లోని తన సగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందడం మృతి పాత్రికేయ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. యండమూరి వరప్రసాద్ గతంలో సాక్షి, ఆంధ్రజ్యోతి, సూర్య తదితర ప్రముఖ దినపత్రికల్లో పనిచేసి జర్నలిజం రంగంలో తనదైన ముద్ర వేశారు.

వృత్తిపట్ల అంకితభావంతో పనిచేస్తూ, నిష్పక్షపాతంగా, నిర్భయంగా వార్తలను ప్రజలకు అందించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలోనూ, వాస్తవాలను ప్రజల ముందుంచడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. దీర్ఘకాలంగా పాత్రికేయ రంగంలో సేవలందించిన వరప్రసాద్ మృతి బాన్సువాడ ప్రాంత పాత్రికేయ లోకానికి తీరని లోటని పలువురు జర్నలిస్టులు, ప్రముఖులు పేర్కొన్నారు.

ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. యండమూరి వరప్రసాద్ మృతి పట్ల పాత్రికేయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

మరిన్ని వార్తలు