అధికారుల హామీతో మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ
కాగజ్ నగర్, అక్టోబర్ 17 ( విజయ క్రాంతి) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పాశుద్ధ్య కార్మికులు జీతాలు చెల్లించాలని చేస్తున్న సమ్మెను అధికారుల హామీతో తాత్కాలికంగా విరమించారు. శనివారం సాయంత్రం జిల్లా అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ,సబ్ కలెక్టర్ హర్ష చౌదరి , మున్సిపల్ కమిషనర్ తిరుపతిలు కార్మికులతో చర్చ జరిపారు. దసరా పండగ నేపథ్యంలో రు. 10 అడ్వాన్స్ గా చెల్లిస్తామని తెలిపారు. అలాగే ప్రతినెల జీతాలు చెల్లించేందుకు అధికారులు కార్మికులకు హామీ ఇచ్చారు.
పెండింగ్లో ఉన్న కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు రు. 1.50 కోట్లు విడతల వారిగా చెల్లిస్తున్నట్లు హామీ ఇచ్చారు. దీంతో గత 4 రోజులుగా మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్య కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు శంకర్ ,సంజీవ్ ,మల్లేష్, శంకరమ్మ , కార్మికులు పాల్గొన్నారు.