PRTU TS రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా రవీందర్ రెడ్డి

17-10-2026 | 11:21pm

మహబూబ్ నగర్ జిల్లా, మహమ్మదాబాద్: అక్టోబర్ 17 విజయక్రాంతి : నల్గొండలో(Nalgonda) నిర్వహించిన PRTU TS రాష్ట్ర 6వ కౌన్సిల్ సమావేశంలో మహమ్మదాబాద్ మండలంZPHS (G)పాఠశాల ఉపాధ్యాయుడు టీ.రవీందర్ రెడ్డి(T. Ravinder Reddy) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గంలో ఆరుగురు అసోసియేట్ అధ్యక్షులు, నలుగురు ఉపాధ్యక్షులు, నలుగురు కార్యదర్శులకు చోటు లభించింది.అసోసియేట్ అధ్యక్షులుగా టీ.రవీందర్ రెడ్డి, ఎం. సురేందర్ రెడ్డి, కే.పాండురంగారెడ్డి,ఎన్.బాలరాజ్ గౌడ్,దివాకర్ రెడ్డి, బీ.గీత ఎంపికయ్యారు.ఉపాధ్యక్షులుగా ఎన్.రాము, శ్రీకాంత్, బీ.నర్సింలు, విష్ణుకుమార్ గౌడ్, కార్యదర్శులుగా టీ.మంగమ్మ, ఎం.బసయ్య, కే.గోపాల్, అనురాధ నియమితులయ్యారు.

ఈ విషయాన్ని మండల అధ్యక్షుడు పుట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బీజం భీంరెడ్డి తెలిపారు.రవీందర్ రెడ్డి ఎన్నిక పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు