పీఆర్టీయూ రాష్ట్ర కమిటీలో చేగుంట ఉపాధ్యాయ సంఘం నాయకులు
రాష్ట్రస్థాయి పదవులకు మండలం నుంచి ఐదుగురు ఉపాధ్యాయ నేతల ఎన్నిక
చేగుంట , అక్టోబర్ 17 (విజయక్రాంతి): పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కమిటీలో(PRTU TS State Committee) చేగుంట మండలానికి చెందిన ఐదుగురు ఉపాధ్యాయ నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు దక్కాయి. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎం వెంకట్ రాంరెడ్డి(Venkat Ramreddy), జి నాగరాజు, బి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డి రాజి రెడ్డి, రాష్ట్ర సెక్రటరీ గా శంకర్ ఎన్నికయ్యారు. ఒకే మండలానికి చెందిన ఐదుగురు నాయకులకు రాష్ట్ర కమిటీలో ప్రాతినిధ్యం లభించడంపై ఉపాధ్యాయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులకు పీఆర్టీయూ టీఎస్ మండల శాఖ అధ్యక్షుడు పి.తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.రాజశేఖర్ అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర నాయకులు కృషి చేయాలని ఆకాంక్షించారు. మండల ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్రస్థాయిలో ప్రస్తావించి పరిష్కారానికి చొరవ చూపాలని వారు కోరారు.