పితృపక్షంలో అమరవీరులకు జోహార్లు
మహబూబాబాద్ (విజయక్రాంతి): పెత్ర మాసం (Pitru Paksha) సందర్భంగా చనిపోయిన పెద్దలను స్మరించుకుంటూ బియ్యం అందించే ఆచారంలో భాగంగా తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న 1,400 మంది అమరులను స్మరించుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద బియ్యం అందజేసి, అమరులకు జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను (Telangana Movement Aspirations) అమలు చేసినప్పుడే అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను (Martyrs' Sacrifices) ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి ఆశయాల సాధన కోసం ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు మైస శ్రీనివాస్, పిల్లి సుధాకర్, శంతన్ రామరాజు, ఖాజాపాష, మైస నాగయ్య, కొండ బత్తుల ఈశ్వర్, అక్కెర మోహన్ రావు, ఐ.వీ. రమణయ్య, మామిడాల సత్యనారాయణ, బాలాష్టి రమేష్, కందగట్ల వెంకన్న, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.