దానిమ్మ తొక్కతో తెల్లజుట్టుకు చెక్‌?

05-10-2026 | 01:12pm

దానిమ్మ తొక్కను (Pomegranate Peel) చిన్న ముక్కలుగా కట్‌ చేసి, బాగా నల్లగా అయ్యే వరకు వేయించాలి. అందులో కొద్దిగా కలొంజీ గింజలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత రెండింటినీ మిక్సీలో వేసి మెత్తగా పౌడర్‌ (Powder)లా చేసుకోవాలి. ఈ పొడిని ఒక బౌల్‌లోకి తీసుకుని, అందులో కొద్దిగా ఉసిరి పొడి, ఆవ నూనె (Mustard Oil) వేసి బాగా కలపాలి. పేస్ట్‌లా తయారైన తర్వాత జుట్టుకు అప్లై (Apply) చేసుకోవచ్చు.

తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ నేచురల్‌ రెమెడీని ప్రయత్నించవచ్చు. అయితే జుట్టు రంగు లేదా తెల్లజుట్టుపై దీని ప్రభావానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి. ఏదైనా పదార్థం తొలిసారి ఉపయోగించే ముందు చిన్న భాగంలో ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం మంచిది.

మరిన్ని వార్తలు