ఓటు తొలగింపు అంటే ఆత్మను వేరుచేయడమే!

05-10-2026 | 08:57am

ఓటు హక్కు తొలగింపుపై జస్టిస్ భూయాన్ కీలక వ్యాఖ్యలు!

ఓట్ల తొలగింపు వ్యవహారంపై జస్టిస్ భూయాన్ కీలక వ్యాఖ్యలు (remarks) చేశారు. మరణం మినహా మరే కారణంతోనూ ఓటు హక్కును తొలగించకూడదని స్పష్టం చేశారు. ఓటు తొలగించే ముందు నోటీసులు జారీ చేసి, సమగ్ర విచారణ (inquiry) నిర్వహించాల్సిందేనని పేర్కొన్నారు. 

ఓటు హక్కును తొలగించడం అంటే శరీరం నుంచి ఆత్మను వేరుచేసినట్లేనని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 326ను ఎవరూ మార్చలేరని, రాజ్యాంగమే (Constitution) అత్యున్నతమైనదని స్పష్టం చేశారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా రాజ్యాంగ నిబంధనలు (rules) పాటించాల్సిందేనన్న సందేశాన్ని ఆయన వ్యాఖ్యలు ఇచ్చాయి.






మరిన్ని వార్తలు