కొత్తకొత్తగా బస్ స్టేషన్లు!

11-11-2026 | 05:15am
  1. 86 బస్టాండ్లకు మోడల్ సొబగులు
  2. రోజుకు 5 వేల కంటే ఎక్కువ రద్దీ స్టేషన్లలో ఆధునిక వసతులు

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 86 బస్టాండ్‌లను మోడల్ బస్ స్టేషన్‌లుగా(Model Bus Station) తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ చర్యలు(RTC Actions) చేపట్టింది. బస్ స్టేషన్లలో రద్దీ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు, ప్రయాణికులకు అవసరమైన సదుపాయా ల కల్పనకు సంస్థ కొత్త కార్యాచరణను సిద్ధం చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజూ 5,000 మందికి పైగా ప్రయాణికుల రద్దీ ఉండే 86 ప్రధాన బస్‌స్టేషన్లలో ప్రయాణీకు ల సమాచార, ప్రసార సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ 86 బస్ స్టేషన్లన్నింటిలోనూ ఒక కంట్రోలర్‌ను ని యించడంతో పాటు ప్రత్యేక విచారణ, సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేశారు.

దీనివల్ల ప్రయాణికులు తమకు కావలసిన బస్సు సర్వీసులు, సమయాలకు సంబంధించిన వివరాలను ఎలాంటి ఆటంకం లేకుం డా తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా బస్సు కార్యకలాపాలపై సమాచారాన్ని అందించేందుకు వీలుగా కొత్త బస్సు టైమ్‌టేబుల్ బోర్డులను కూడా అన్ని బస్‌స్టేషన్లలో త్వరలోనే ప్రదర్శించనున్నారు. 

ప్రయాణీకుల భద్రత, రద్దీ నిర్వహణ, కార్యకలాపాల పర్యవేక్షణను మరింత పటిష్టం చేసేందుకు త్వరలో అన్ని బస్ స్టేషన్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఈ సీసీ కెమెరాల వ్యవస్థను ప్రాంతీ య కార్యాలయాలు, ప్రధాన కార్యాలయానికి నేరుగా అనుసంధానిస్తారు. ఆర్టీసీ బస్‌స్టేషన్‌లలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, రద్దీ నిర్వహణను నిర్ధారించడం, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే యాజమాన్యం ప్రధాన ఉద్దేశమని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు