వైభవంగా దసరా వేడుకలు
- చెడుపై మంచి విజయం సాధిద్దాం
- దసరా వేడుకల్లో ఎమ్మెల్యే
నిర్మల్, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి) : చెడుపై మంచి విజయం సాధించాలని విజయదశమి ప్రత్యేకత అని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి (Nirmal MLA Maheshwar Reddy)అన్నారు. దసరా ఉత్సవాలు భాగంగా పట్టణంలోని బంగల్పెట్ మహాలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. రావణ రాష్ట్రం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దేశంలో చెడును దూరం చేసుకుని మంచిని సాధించి సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం జరుగుతుందని తెలిపారు. నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి దసరా ఉత్సవాలకు మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హిందు వాహిని విశ్వహిందూ పరిషత్ తదితరులు పాల్గొన్నారు.
దసరా వేడుకలో ఖానాపూర్ ఎమ్మెల్యే
ఖానాపూర్ : ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక ప్రజలతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ఖానాపూర్ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు.
దుర్గాదేవికి వ్యాపారుల పూజలు
బెజ్జూర్ : బెజ్జూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయం అర్చకులు గురుదత్ ఆధ్వర్యంలో చివరి రోజు దుర్గాదేవి మండపంలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రకరకాల నైవేద్యాలు 51 సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
శ్రీ రంగనాయక స్వామి ఆలయ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్ దుర్గాదేవి శోభాయాత్ర వాహనాన్ని రంగురంగుల పువ్వులతో దుర్గాదేవి శోభ యాత్ర వాహనాన్ని సిద్ధం చేశారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అనంతరం అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కొండ్ర జగ్గా గౌడ్, నాగభూషణ్ గౌడ్, భోగ రమేష్, సామల బాలాజీ, నరేందర్ గౌడ్, మిరియాల పెంటయ్య, మేరీ రంగయ్య, ఉపేంద్ర చారి, తంగిడిపల్లి నీలేష్ దంపతులు, తదితరులు పూజలు నిర్వహించారు.
ఆదిలాబాద్లో వైభవంగా దసరా వేడుకలు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. హిందూ సమాజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకల్లో శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠాధిపతి యోగనంద సరస్వతీ స్వామి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష,
మాజీ మంత్రి జోగు రామన్న, మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ కన్యక పరమేశ్వరీ ఆలయం నుండి కషాయపూ జెండాతో దసరా మైదానం వరకు శోభాయాత్ర చేపట్టారు. అనంతరం అతిథులు షమీ చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి, రావణ దహనం చేపట్టారు.
ఘనంగా దుర్గా నిమజ్జనం
లక్షెట్టిపేట రూరల్ : లక్షెట్టిపేట మండలంలో దుర్గాదేవి నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దుర్గాభవాని కలశాలకు, చీరలకు వేలం పాట నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని భాజా భజంత్రీలు, డప్పు చప్పుల్ల మధ్య నిమజ్జనానికి తరలించారు. సమీప గోదావరి తీరంలో, గ్రామ చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేశారు.