బోణి కొట్టేదెవరో ?
స్వదేశీ పిచ్‌లపై పరుగుల వరద పారిస్తూ చెలరేగిపోయిన టీమిండియా బ్యాటర్లకు అసలు సిసలు పరీక్ష ఎదురుకాబోతోంది. పేస్, స్వింగ్‌కు అనుకూలించే న్యూజిలాండ్ పిచ్‌లపై ధనాధన్ సమరానికి భారత్ సిద్ధమైంది. భువనేశ్వర్ రీఎంట్రీ ఇవ్వనున్న ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడే అవకాశాలు లేనట్టే. అటు విదేశీ గడ్డపై సారథిగా శ్రేయాస్ అయ్యర్‌కు ఈ సిరీస్ అగ్నిపరీక్షగానే చెప్పాలి.
- నేటి భారత్, కివీస్ తొలి టీ20
- భా రత బ్యాటర్లకు పేస్ సవాల్
- భువనేశ్వర్ రీ ఎంట్రీ
- తుది జట్టులో వైభవ్‌కు నో ఛాన్స్
క్రైస్ట్‌చర్చ్, అక్టోబర్ 21 : భారత్, న్యూజిలాండ్(India, New Zealand) ఐదు టీ20ల సిరీస్‌కు గురువారం నుంచే తెరలేవ బోతోంది. పొట్టి ఫార్మాట్‌లో వర ల్డ్ ఛాంపియన్స్‌గా ఉన్న టీమిండియాకు ఈ సిరీస్ పెద్ద సవా ల్‌గానే చెప్పాలి. ఎందుకంటే భారత పిచ్‌ల తరహాలో ఇవి ఫ్లాట్ వికెట్లు కావు. పూర్తిగా బౌన్స్, స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లు. ఇక్కడ మన టీ20 హిట్టర్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యం గా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఈ సిరీస్ కఠిన పరీక్షగా చెప్పొచ్చు. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లలో ఘోరపరాజయాలు చవిచూసిన శ్రేయాస్ కివీస్ గడ్డపై జట్టును విజయపథంలో నడిపించాలని ఎదు రుచూస్తున్నాడు. విండీస్‌తో సిరీస్ ముగిసిన రెండు రోజుల్లోనే న్యూజిలాండ్‌కు చేరుకున్నప్పటకీ తగినంత ప్రాక్టీస్‌కు సమయం దొరకలేదు.
ఒకరోజు ప్రాక్టీస్ తో కివీస్ పరిస్థితులకు అలవాటు పడడం అంత ఈజీ కాదని మాజీలు చెబుతున్నారు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగే తొలి టీ20 కోసం భారత తుది జట్టు కూర్పు ఆసక్తిగా మా రింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. సం జూ, అభిషేక్ శర్మ కాంబినేషన్‌ను ఇప్పట్లో విడదీసే అవకా శం లేదని కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ తేల్చేశారు. అటు తుది జట్టుకు సంబంధించి బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమా ర్ రీఎంట్రీ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న భువీపైనే అందరి దృష్టీ ఉంది. స్వింగ్ కింగ్‌గా పేరున్న భువనేశ్వర్ బౌలింగ్‌కు కివీస్ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. దీంతో ఈ వెటరన్ పేసర్ ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ సిరీస్‌లో భువీ చెలరేగితే వచ్చే వరల్డ్‌కప్‌కు అతన్ని పరిగణ లోకి తీసుకునే అవకాశముంటుంది.
భువీతో పాటు అర్ష్దీప్ సింగ్ ఆడ టం దాదాపు ఖాయం. మూడో ఫాస్ట్ బౌలర్ స్థానం కోసం ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ప్రిన్స్ యాదవ్‌కు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. భారత జట్టులో శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. అయితే తుది జట్టులో వీరిద్దరూ కలిసి ఆడతారా లేదా అనేది చూడాలి..స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు.
దీంతో కుల్దీప్‌ను పక్కన పెట్టొచ్చు. ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు సొంతగడ్డపై న్యూజి లాండ్ చాలా ప్రమాదకరం. ఆ జట్టులోనూ టీ20 హిట్టర్స్ చాలా మందే ఉన్నారు. ఫిన్ అలెన్, సిఫర్ట్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ లాంటి స్టార్స్ ఎలా చెలరేగి ఆడతారో ఐపీఎల్‌లో చూసాం. బౌలింగ్‌లోనూ కివీస్ బలంగా ఉంది. ఇక పిచ్ విషయానికొస్తే క్రైస్ట్‌చర్చ్ వికె ట్ పేసర్లకు అనుకూలిస్తుంది.
తుది జట్ల అంచనా
భారత్ : సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, భువనేశ్వర్ కుమార్, అర్షీప్‌దీ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, సిఫర్ట్, కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, బ్రేస్‌వెల్, శాంట్నర్(కెప్టెన్), స్మిత్, జేమీసన్, హెన్రీ, ఫెర్గ్యూసన్