హార్థిక్ ఇప్పట్లో కష్టమే
- గాయం నుంచి కోలుకోని ఆల్‌రౌండర్
- మళ్లీ ఐపీఎల్‌లోనే రీఎంట్రీ
బెంగళూరు, అక్టోబర్ 21 : టీమిండియా కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా(All-rounder Hardik Pandya) ఇప్పట్లో ప్రొఫెష నల్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గాయం నుంచి పూర్తిస్థా యిలో కోలుకోకపోవడమే దీనికి కారణం. కాలి కండరాల లోపలి భాగంలో ఏర్పడిన స్ట్రెస్ గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాస చికిత్స తీసుకుంటున్నాడు.
పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధిం చేందుకు కనీసం రెండు,మూడు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే సెంబర్ 13 నుంచి ప్రారంభం కాను న్న శ్రీలంకతో వన్డే లు, టీ20ల సిరీస్‌కు, జనవరి 3 నుంచి జరగనున్న జింబా బ్వేతో వన్డే సిరీస్‌లోనూ అతను ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. సీవోఈ వర్గాల సమాచారం ప్రకారం వైద్యుల సూచనల మేరకు దశలవారీగా ఫిట్‌నెస్ సాధించేందుకు హార్దిక్ ప్రయత్నిస్తున్నాడు. మరో మూడు వారాల తర్వాత అతడు నెమ్మదిగా జాగింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.