ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లోకి

22-10-2026 | 05:41am
  1. 3,987మంది వివరాలు లీక్
  2. సెర్ట్ ఇన్ హెచ్చరికతో బ్యాంకు అప్రమత్తం
  3. స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ప్రకటన
  4. యథావిధిగా కార్యకలాపాలు
  5. డేటా లీక్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టిన బ్యాంకు

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు(State Bank of India) చెందిన 3,897 మంది ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్ అయిందని, ఈ ఉల్లంఘనపై బ్యాంకు దర్యాప్తు ప్రారంభించిందని ఎస్‌బీఐ బుధవారం స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో ప్రకటించింది. పేరు, మొబైల్ నెంబర్, ఈ చిరునామా, ఆధార్ నంబర్, బ్యాంక్ సీఐఎఫ్ (కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ నంబర్)లు సైబర్ దాడికి పాల్పడ్డ హ్యాకర్లు డార్క్ వెబ్‌లో పెట్టారని అంగీకరించింది.

దీంతో కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వ్యాపార కొనసాగింపులపై ప్రభావం పడలేదని స్పష్టం చేసింది. థ్రెట్ ఇంటలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్ అయిన డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఇఆర్‌టీఐఎన్ ఇన్) నుంచి తమకు హెచ్చరిక అందిందని తెలిపింది. హెచ్చరిక అనంతరం ఎస్బీఐ ప్రాథమిక విచారణలో 3,75 లక్షల రికార్డుల విశ్లేషణలో 3,897 మంది వినియోగదారుల రికార్డులను డార్క్ వెబ్‌లో గుర్తించామని పేర్కొన్నారు.

విషయం తెలియగానే భద్రతా నివారణ ప్రోటోకాల్‌ను అమలు చేశామని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. నష్టాన్ని అంచనా వేసేందుకు సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని, అనంతరం చర్యలు చేపడతామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

మరిన్ని వార్తలు