అందరి జీవితాల్లో విజయాలు కలగాలి

22-10-2026 | 05:15am
  1. కరీంనగర్ మార్క్‌ఫెడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా రావణ దహనం.. - 
  2. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల 

కరీంనగర్, అక్టోబర్ 21 (విజయ క్రాంతి):  విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని మార్క్ఫెడ్ గ్రౌండ్స్లో రాంలీలా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విజయదశమి అం టేనే విజయం, ధర్మం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపా లని ఆకాంక్షించారు.

ఢిల్లీలో నిర్వహించే రాంలీలా కార్యక్రమం తరహాలో కరీంనగరో ్లని మార్క్ఫెడ్ గ్రౌండ్స్లో కూడా రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం సం తోషంగా ఉందన్నారు. పల్లెల్లోనూ విజయదశమి వేడుకలను ప్రజలు ఉత్సాహంగా జ రుపుకుంటున్నారని తెలిపారు. చెడుపై మం చి విజయం సాధించాలని, ప్రజలందరి జీవితాల్లో విజయాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజలం తా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

గంగమ్మ ఒడికి దుర్గమ్మ..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దుర్గా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, ప్రత్యేక పూజలందుకున్న దుర్గ మ్మ లక్ష్మీ స్వరూపాలు విజయదశమి (దసరా) ముగింపు వేడుకల అనంతరం బుధ వారం గంగమ్మ ఒడికి చేరాయి. మహా శక్తి దేవాలయం లో దుర్గ మాత నిమర్జన కార్యక్రమం లో  కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నా రు.

ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డెప్యూటీ మేయర్ యా దగిరి సునీల్ రావు, సూడా మాజీ  చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో పాటు పలువురు ఐప్రాంతాలలో జారిగిన నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు.కరీంనగర్ నగరంతో పాటు జగిత్యాల,

పెద్దపల్లి,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని ప్రముఖ శక్తీ పీఠాలు, వీధుల లోని నవరాత్రి పూజా మండపాలలో కొలువుదీరిన అమ్మవార్ల నిమజ్జన శో భయాత్రలను నిర్వాహకులు, భక్తులు ఘనం గా నిర్వహించారు.కరీంనగర్లోని గాంధీ రోడ్, వినాయక్ నగర్, చైతన్యపురి వంటి ప్రధాన ప్రాంతాల నుంచి దేవి విగ్రహాలను భారీ కోలాటాలు, మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో శోభాయాత్రగా తరలించారు.

మహిళలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి నృత్యాలు చేస్తూ, అమ్మవారికి మంగళ హారతులు పట్టి ఘనంగా వీడ్కోలు పలికారు. ఉమ్మడి జిల్లాలోని పవిత్ర గోదావరి నది తీరాలు (ధర్మపురి, కోటిలింగాల, మంథని), స్థానిక చెరువులు , జలాశయాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు (క్రేన్లు, లైటింగ్, గజ ఈతగాళ్లు) చేయగా, అమ్మవార్లను భక్తిభావంతో నిమజ్జనం చేశారు.శాంతిభద్రతల పరంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారు.

శమీ పూజలో మంత్రి పొన్నం, మాజీ మంత్రి గంగుల 

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని చారిత్రాత్మక, పురాతన గిద్దెపెరుమాళ్ స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కలిసి శమీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

విజయదశమి పర్వదినం సందర్భంగా సర్వేజనా సుఖినోభవంతు అనే ఆకాంక్షతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరికీ విజయం చేకూరాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేస్తున్న ప్రజాప్రతినిధులందరికీ ప్రజాసేవలో మరింత శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదించాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసేలా ఆశీర్వదించాలని భగవంతుడిని కోరుకున్నట్లు చెప్పారు.

ప్రస్తుత ప్రకృతి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చారిత్రాత్మకమైన గుర్తింపు ఉందని, విద్య, వైద్యం, క్రీడలు, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి రంగాల్లో జిల్లా మరింత ప్రగతి సాధించేలా ప్రజాప్రతినిధులందరం సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అగ్రభాగాన నిలిచేలా ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విజయదశమి స్ఫూర్తితో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు