జెన్ జీల కోసం బబ్లూ XXL వస్తున్నాడు!

22-10-2026 | 05:53am

ప్రముఖ నిర్మాతలు పుష్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ ఎన్. నారంగ్ నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినిమాస్(Sree Venkateswara Cinemas) సంస్థ మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. యంగ్ ట్యాలెంటెడ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జెన్ జెడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

ఈ సినిమా సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నరెండో సినిమా. ఆయన తొలి చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి ‘బబ్లూ XXL’ అనే టైటిట్‌ను ఖరారు చేస్తూ, మేకర్స్ కలర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దసరా సందర్భంగా ప్రకటించిన ఈ టైటిల్, పోస్టర్ సినిమా యూత్‌ఫుల్, ఫన్ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి.

ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ సరసన గహజీ ఎస్కే కథానాయికగా నటిస్తుండగా.. రాధికా శరత్‌కుమార్, జయలలిత, శివాజీ రాజా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. నరేశ్ అడుప ఎడిటింగ్ నిర్వహిస్తుండగా, పవన్ కల్యాణ్ ఎల్లపు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు