బీర్లకు ఫుల్ డిమాండ్.. 19 రోజుల్లో రూ.2,054 కోట్లు
హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ సీజన్ మద్యం విక్రయాలపై(Telangana Liquor Sales) స్పష్టమైన ప్రభావం చూపించింది. అక్టోబర్ 1 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 37.02 శాతం పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడించాయి. పండుగ సందడి పెరిగిన కొద్దీ Liquor Sales కూడా వేగం పుంజుకోగా, ముఖ్యంగా బీర్ల విక్రయాల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది.
బీర్ల అమ్మకాల్లో భారీ పెరుగుదల.. లెక్కలు ఇవే!
ఈసారి తెలంగాణలో Beer Sales, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) విక్రయాలతో పోలిస్తే వేగంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి 19 వరకు 21.55 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే సమయంలో 30.37 లక్షల కేసులకు చేరాయి. అంటే బీర్ల విక్రయాల్లో 41 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. మరోవైపు, IMFL Sales కూడా పెరిగాయి. గత ఏడాది 14.16 లక్షల కేసులుగా ఉన్న విక్రయాలు ఈసారి 18.38 లక్షల కేసులకు చేరుకున్నాయి.
ఒక్కరోజే రూ.303 కోట్ల అమ్మకాలు!
అక్టోబర్ 19న తెలంగాణలో ఒక్కరోజులోనే రూ.303.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. పండుగ సీజన్ ప్రారంభంలో అమ్మకాలు కొంత నెమ్మదిగా సాగినప్పటికీ, రెండో వారం నుంచి వేగం పెరిగింది. అక్టోబర్ 16 నాటికి మొత్తం Liquor Sales విలువ రూ.1,527.85 కోట్లుగా ఉండగా, కేవలం మూడు రోజుల్లోనే రూ.2,000 కోట్ల మార్కును దాటింది. అక్టోబర్ 19 వరకు నమోదైన గణాంకాల ప్రకారం దసరా సీజన్లో మద్యం వ్యాపారం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.