భారత్‌కు ముగ్గురే శత్రువులు

22-10-2026 | 05:39am
  1. దేశానికి హాని కలిగించే శక్తులు..
  2. సమాజాన్ని విభజించే వ్యక్తులు..
  3. మన సంస్కృతిని ద్వేషించే వారు.. 
  4. వారంతా దేశ విద్రోహులే..
  5. వారి ఓటమికి ‘నేషన్ ఫస్ట్’ ప్రతిజ్ఞ పూనాలి
  6. ‘రామరాజ్యం’ అంటే ప్రజా సంక్షేమమే లక్ష్యం 
  7. దసరా వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత్‌లో శత్రువులను గుర్తించి, వారిని ఓడించేందుకు ‘దేశ మే ప్రథమం’ (నేషన్ ఫస్ట్) అనే ప్రతిజ్ఞను స్వీకరించాలని పౌరులకు ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) పిలుపునిచ్చారు. దేశానికి హాని కలి గించే శక్తులు, సమాజాన్ని విభజించే వ్యక్తు లు, మన సంస్కృతిని ద్వేషించే మనస్తత్వం కలిగిన వారంతా దేశ శత్రువులేనని స్పష్టం చేశారు.

ఈ మూడు రకాల వారిని దేశానికి శత్రువులుగా గుర్తించి, జాతీయ ప్రయోజనాల కోసం ప్రజలు, సంస్థలు ఏకం కావాలన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా కోరుతూ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అలాగే జాతీయ ప్రయోజనాల కోసం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అందరూ కలిసి రావాలని రాజకీయ పార్టీలకు మోదీ పిలుపునిచ్చారు. ‘రామరాజ్యం’ నేటికీ సుపరిపాలనకు స్ఫూర్తి అని, అక్కడ ఎవరి పట్లా వివక్ష ఉండదని, అందరికీ న్యాయం జరుగుతుందని, సమాన అవకాశాలు లభిస్తాయని, అక్కడ అధికారం అంటే పాలించ డం కాకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఉంటుందని ప్రధాని చెప్పారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మనం శ్రీరాముని నుంచి స్ఫూర్తి పొందాలని, ‘నాగరికో దేవో భవ’ (పౌరులే దైవం) అనే మం త్రంతో ముందుకు సాగాలన్నారు. ఢిల్లీలోని ఐపీ గ్రౌండ్‌లో జరిగిన విజయదశమి వేడుకల్లో మోదీ మాట్లాడారు. జాతీయ ప్ర యోజనా ల కోసం అన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసి నిలబడాలని కోరారు. 

దేశంలోని సం స్థలు, రాజకీయ పార్టీలు జాతీయ ప్రయోజనాల కోసం కలిసి నిలబడాలి. మనం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. దేశ శత్రువులపై కలిసి పోరాడాలి’ అని ప్రధానమంత్రి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఏకాభిప్రా యం సాధిం చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో, ప్రధాని వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించు కు న్నాయి.

భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు. ‘మనం మన వనరులపై విశ్వాసం ఉంచాలి. మన సంక ల్పాన్ని శక్తిగా మార్చుకుని, మన సొంత కృషితో పరిష్కారాలను కనుగొనాలి. ఎందుకంటే, కష్టాలు మన ప్రయాణాన్ని ఆపలేవని శ్రీరాము డు మనకు బోధించాడు’ అని పేర్కొన్నారు. ‘సంక్షోభం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా..

మనం ఇతరులపై ఆధారపడి చేతులు కట్టుకుని కూర్చోకూడదు’ అని తెలిపారు. ‘శత్రువు ఎంత శక్తిమంతుడైనా, మనం సత్యం, మానవత్వంతో నిలబడినప్పుడు, విజయం అంతిమంగా మనదే అనే ధైర్యాన్ని ఈ పండుగ మనలో నింపుతుంది. ఈ దసరా స్ఫూర్తియే ఎల్లప్పుడూ భారతదేశ సిద్ధాంతం’ అని అన్నారు. భారత్, రష్యా ఇంధన కొనుగోళ్ల విషయంలో భారత్- ద్వైపాక్షిక సంబంధాలలో ఘర్షణల నడుమ, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ముంబైకి వచ్చిన రోజే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

శ్రీరామచంద్రుడే ఆదర్శం.. జనమే జనార్దనుడు

మార్గంలోని కష్టాలు ప్రయాణాన్ని ఆపలేవని శ్రీరాముడు బోధించాడని మోదీ అన్నారు. ఒక దేశానికి ఆత్మగౌరవం ఉన్నప్పుడే అది పురోగమిస్తుంద ని, ఆ ఆత్మగౌరవాన్ని తీర్చిదిద్దడంలో దాని వారసత్వం ప్రధాన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ‘అందుకే దేశం ఇప్పుడు తన వారసత్వాన్ని, గుర్తింపును కాపాడుకోవడానికి కృషి చేస్తోంది’ అని పేర్కొన్నారు. 

విజయదశమి  విజయానికి ప్రతీక అని, ఇదే శ్రీరామచం ద్రుని ఆదర్శం. అందుకే, మనం ప్రజలను ఎల్లప్పుడూ ‘జనార్దనుని’గా (దైవ స్వరూపులుగా) భావించి, ‘నాగరికో దేవో భవ’ (పౌరులే దైవం) అనే మం త్రంతో ముందుకు సాగాలి. పేదలు, అ ణగారిన వర్గాల సేవకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి’ అని ప్రధాని అన్నారు.

మరిన్ని వార్తలు